రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాని తెరకెక్కించి.. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో డబ్బింగ్ కూడా చెప్పించేస్తున్నారు. అయితే తాజాగా ఆర్.ఆర్.ఆర్ రామరాజు.. డిస్ని ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో.. చరణ్ నిన్న రాత్రి స్టార్ మా బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. నాగార్జున పక్కన రామ్ చరణ్.. నించుని.. సర్ మిమ్మల్ని అంకుల్ అనాలో.. లేదంటే సర్ అని పిలవాలో తెలియడం లేదు.. మిమ్మల్ని చూస్తే బ్రదర్ లా ఉన్నారు అంటూ ఆట పట్టించాడు.
అయితే తరవాత నాగార్జున చరణ్ నువ్వు నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ అండ్ ఆచార్య ల గురించి చెప్పు.. ఆర్.ఆర్.ఆర్ నువ్వు ఎన్టీఆర్ చేసే యాక్షన్ సీన్స్ గురించి గొప్పగా చెబుతున్నారు. మీరు కష్టపడే విధానం హ్యాట్సాఫ్ అన్నాడు. దానికి రామ్ చరణ్ సర్ ప్రతీ రోజు డబ్బింగ్ చెబుతున్నాను. కార్తీకేయ, వల్లి గారిని ఒక్కసారి నాకు పాట చూపించమని అడిగినా చూపించడం లేదు. మాతో 15 రోజులు సినిమా షూటింగు చేసిన తర్వాత కూడా మాకు చూపించారా అన్నా చూపించడం లేదు.
ఇక గత వారం ఆచార్య షూటింగులో పాల్గొన్నాను. డాడీతో వర్క్ చేయడం ఆదో కొత్త అనుభూతి. కానీ ఇంట్లో ఉంటే.. నేను నాన్న కనీసం అంత క్లోజ్‌గా ఉండం. షూటింగులో డాడ్ తోపనిచేస్తుంటే ఆ విషయం నాకు బోధపడింది. అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.