Advertisementt

అఖండ ఫ‌స్ట్ సింగిల్ అడిగా అడిగా

Sat 18th Sep 2021 06:31 PM
balakrishna,akhanda,adigaa adigaa first single out  అఖండ ఫ‌స్ట్ సింగిల్ అడిగా అడిగా
Akhanda Adigaa Adigaa first single out అఖండ ఫ‌స్ట్ సింగిల్ అడిగా అడిగా
Advertisement
Ads by CJ

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రంఅఖండ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై  యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.  ఈ మూవీ మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్టింది చిత్ర యూనిట్‌. దానిలో భాగంగా ఈ రోజు అఖండ ఫ‌స్ట్ సింగిల్ అడిగా అడిగా ను రిలీజ్ చేశారు.  

ఈ పాట బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ కు ఒకరిపట్ల ఇంకొకరి ఎంత ప్రేమ ఉందో చూపించేలా సాగింది. ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్న త‌మ‌న్ ఈ మెలోడి గీతం కోసం ఒక అద్భుత‌మైన ట్యూన్ ను అందించారు. ఎస్పీ చరణ్, ఎంఎల్ శ్రుతి ఈ పాటను శ్రావ్యంగా పాడారు. కళ్యాణ్ చక్రవర్తి  మంచి సాహిత్యాన్ని అందించారు. ఈ  పాట సంగీత ప్రియుల్ని అల‌రిస్తుంది.

ఇక బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జోడి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. కొరియోగ్రఫీ  అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. బోయపాటి శ్రీను సినిమాలంటే కచ్చితంగా మంచి మెలోడీ పాట ఉండాల్సిందే. ఆ కోవలో త‌ప్ప‌కుండా అడిగా అడిగా పాట‌ చేరుతుంది.

Akhanda Adigaa Adigaa first single out:

Balakrishna Akhanda Adigaa Adigaa first single out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ