పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా.. RC15 మూవీ మూడు భాషల్లో తెరకెక్కడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్ గానే చిరు క్లాప్ కొట్టగా RC15 అంగరంగ వైభవంగా మొదలైంది. RC15 ముహూర్తం పోస్టర్ కె శంకర్ 2 కోట్లు ఖర్చుపెట్టించారని అంటున్నారు. మరి శంకర్ అంటేనే భారీ తనం. RC 15 విషయంలో శంకర్ తగ్గుతున్నారా? లేదంటే ఎప్పుడు లెక్కలు వేసుకునే దిల్ రాజే ఓ మెట్టు దిగి.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కదా ఎంత పెడితే అంతకు డబుల్ వస్తుంది అని నమ్ముతున్నాడా?
శంకర్ తో సినిమా అంటే ఆస్తులు అమ్ముకోవాలని అంటుంటారు నిర్మాతలు. పోస్టర్ కె 2 కోట్లు పెడితే.. సినిమాని 200 కోట్లలో తియ్యడం శంకర్ పని అవుతుందా.. అసలు బడ్జెట్ విషయంలో శంకర్ తగ్గారా.. ఎంతయినా పర్లేదు.. నేను చూసుకుంటాను అని శంకర్ కి దిల్ రాజు భరోసా ఇచ్చారా అనేది ఇప్పడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ సినిమాలో ఎక్కువగా టాలీవుడ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒక్క హీరోయిన్ నే బాలీవుడ్ ని పట్టుకొచ్చారు కానీ.. మిగతావన్నీ టాలీవుడ్ మీదే నడుస్తున్నాయి.
అంటే శంకర్ నటినటుల విషయంలో దిల్ రాజుని ఫాలో అవుతున్నారా? లేదంటే శంకర్చూపు బాలీవుడ్ పైనే ఉంటుంది. అలాంటిది టెక్నీకల్ టీం దగ్గరనుండి నటుల వరకు టాలీవుడ్ అంటున్నారంటే.. ఇక్కడ బడ్జెట్ విషయంలో శంకర్ ఓ మెట్టు దిగారనిపిస్తుంది. రామ్ చరణ్ ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్ళిపోయాడు.. సో లెక్కలు మానుకుని.. ఎంత బడ్జెట్ అయినా పెడదామని దిల్ రాజు ఫిక్స్ అయ్యాడో కానీ.. అందరికి మాత్రం అంతకంతకు కన్ఫ్యూజన్ ఎక్కువైపోతోంది.