కరోనా కారణంగా గత ఏడాది వి సినిమాని ఓటిటి నుండి రిలీజ్ చేసిన నాని కి ఆ సినిమా ప్లాప్ నే ఇచ్చింది. నాని విలన్ గా తన 25 వ సినిమాగా ప్రాజెక్ట్ చేసి ప్రమోట్ చేసిన.. వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా అమెజాన్ లోనే కాదు.. బుల్లితెర మీదా నిరాశనే మిగిల్చింది. తాజాగా నాని - శివ నిర్వాణ కాంబోలో వచ్చిన టక్ జగదీశ్ ని కూడా మేకర్స్ ఓటిటి నుండి మంచి బేరం వచ్చింది కదా అని అమ్మేసారు. టక్ జగదీశ్ వినాయక చవితి స్పెషల్ గా అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన టక్ జగదీశ్ అమెజాన్ ప్రైమ్ కి లాభాలు తెస్తుంది అనుకుంటే.. నష్టాలే మిగిల్చింది అంటున్నారు.
ఈ రెండు సినిమాల డిజాస్టర్ తో నాని ఇప్పుడు టెంక్షన్ పడుతున్నాడట. కారణం నాని - సాయి పల్లవి కాంబోలో రాబోతున్న శ్యామ్ సింగరాయ్ మార్కెట్ పై ఈ సినిమాల ఎఫెక్ట్ ఎమన్నా పడుతుందేమో అనే ఆలోచనలో నాని సతమతమవుతున్నాడట. శ్యామ్ సింగరాయ్ ని కొనే డిస్ట్రిబ్యూటర్స్ వి, టక్ జగదీశ్ ని చూపించి.. తక్కువ ధరకు బేరమాడితే కష్టం కదా.. సో అందుకే నాని ఇప్పడు టెక్షన్ లో ఉన్నాడంటున్నారు. శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ముగించేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా వుంది.. రేపో మాపో రిలీజ్ డేట్ ఇచ్చినా ఇవ్వొచ్చు.