Advertisementt

పాపం.. ఈ యంగ్ హీరోకి మరో షాక్!

Mon 27th Sep 2021 11:18 AM
sundeep kishan,gully rowdy,gully rowdy talk,flop,box office  పాపం.. ఈ యంగ్ హీరోకి మరో షాక్!
One More flop in Hero Sundeep Kishan Account పాపం.. ఈ యంగ్ హీరోకి మరో షాక్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో హీరోగా నిలదొక్కుకున్న సందీప్ కిషన్.. ఇప్పటికీ హీరోగా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వరస సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తున్న.. సందీప్‌కి టైం కలిసి రావడం లేదు. తాను నటించిన సినిమాలకు విపరీతమైన ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నా.. సినిమా రిలీజ్ అయ్యేసరికి.. అందులో విషయం లేదని తేలిపోతుంది. మొన్నటికి మొన్న వచ్చిన A1 ఎక్స్‌ప్రెస్ కూడా అంతే. ఇంకేంటి సినిమా హిట్ అన్నారు.. కానీ కలెక్షన్స్ లేవు. ఆ సినిమాకి ప్రమోషన్స్ సందీప్ కిషన్ టీమ్‌తో కలిసి విపరీతంగా చేశాడు.

 

ఇక తాజాగా ‘గల్లీ రౌడీ’తోనూ సందీప్ కిషన్ అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి భీభత్సమైన ప్రమోషన్స్ చేసినా.. సినిమా రిలీజ్ తర్వాత క్రిటిక్స్ నుండి, ప్రేక్షకుల నుండి ‘గల్లీ రౌడీ’కి ఒకటే టాక్ పడింది. సో సో టాక్ తో గల్లీ రౌడీ థియేటర్స్‌లో రన్ అవుతుంది. సందీప్ కిషన్ పెరఫార్మెన్స్ బాగుంది.. కానీ ఇంకా సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డైరెక్షన్ అన్ని వీక్ గా ఉండడంతో సందీప్ కిషన్ మరో ప్లాప్ కొట్టాడు. వరసగా సినిమాలు ప్లాప్ అవడంతో ఇప్పుడు సందీప్ కిషన్ ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. 

One More flop in Hero Sundeep Kishan Account:

Sundeep Kishan Gully Rowdy Talk at Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ