Advertisementt

నితిన్ మ్యాస్ట్రో కి బిగ్ షాక్

Fri 17th Sep 2021 01:13 PM
maestro,nithin maestro movie,maestro full movie leaked,maestro full movie leaked online,maestro movie review  నితిన్ మ్యాస్ట్రో కి బిగ్ షాక్
Big Shock to Nithin Maestro నితిన్ మ్యాస్ట్రో కి బిగ్ షాక్
Advertisement
Ads by CJ

నితిన్ - నభ నటేష్ జంటగా.. గ్లామర్ బ్యూటీ తమన్నా విలన్ కేరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ హిట్ అంధాదున్ మూవీని తెలుగులో మ్యాస్ట్రో గా రీమేక్ చేసారు. ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా.. కరోనా కారణముగా ప్రముఖ ఓటిటి డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుండి రిలీజ్ చేసారు మేకర్స్. మ్యాస్ట్రో మూవీకి భారీ గా ఓటైటి డీల్ రావడంతో.. మేకర్స్ ఈ సినిమాని ఓటిటి కి అమ్మేసారు. ప్రమోషన్స్ పరంగా అదరగొట్టేసింది నితిన్ మ్యాస్ట్రో మూవీ.

అయితే మ్యాస్ట్రో మూవీ విడుదలైన కొన్ని గంటల్లోనే భారీ షాక్ తగిలింది. ఈ సినిమా డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుండి రిలీజ్ అయిన కొద్ధి గంటల్లోనే.. సినిమాలోని చాలా సీన్స్ లీకైపోయి సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అంతేకాకుండా హెచ్‌డీ క్వాలిటీతో మూవీ రూల్జ్, ఐబొమ్మ వంటి కొన్ని వెబ్‌సైట్లలో మ్యాస్ట్రో మూవీ బొమ్మ కనిపించేసరికి నితిన్ ఫాన్స్ షాకవుతున్నారు. థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలకే ఇలాంటి లీకుల గోల తప్పడం లేదు. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అంటే వదిలేస్తారా.. ఇలా సినిమాలను సినిమాలను లీక్ చేసి పారేస్తే మేకర్స్ పరిస్థితి ఏమిటి. నితిన్ ఫాన్స్ ఇలాంటి లింక్స్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చెయ్యండి.. ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యొద్దు అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. 

Big Shock to Nithin Maestro:

Maestro Full Movie Leaked Online

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ