Advertisementt

ఈడీ ఆఫీస్ లో హీరో తనీష్

Fri 17th Sep 2021 11:59 AM
hero tanish,ed office,tanish,ed,investigation  ఈడీ ఆఫీస్ లో హీరో తనీష్
Hero Tanish at ED Office ఈడీ ఆఫీస్ లో హీరో తనీష్
Advertisement
Ads by CJ

హీరో తనీష్ నటించిన మరో ప్రస్థానం మూవీ ప్రమోషన్స్.. జోరుగా ఉన్న టైం లో తనీష్ ఈడీ అధికారుల ఎదుట మనీ లాండరింగ్ కేసులో హాజరవడం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ఈ మనీ లాండరింగ్ కేసులో తనీష్ కాకుండా.. టాప్ డైరెక్టర్, హీరో, హీరోయిన్స్ హజవుతున్నారు. తాజాగా తనీష్ ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యాడు. గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో తనీష్ విచారణకు హాజరయ్యాడు. అంతేకాకుండా శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలోనూ హీరో తనీష్ పేరు వినిపించింది. తాజాగా ఈడీ మనీ లాండరింగ్ కేసులో తనీష్ ని విచారణకు పిలిచింది. 

కానీ తనకి డ్రగ్స్ సరఫరా దారుడు కెల్విన్ తో ఎలాంటి సంబంధాలు లేవని, తనకి ఈ కేసుతో సంబంధం లేదని, ఈడీ అధికారులకి సహకరిస్తాను అంటూ తనీష్ తాజాగా జరిగిన మూవీ ప్రెస్ మీట్ లో చెప్పడం గమనార్హం. 

ఈడీ అధికారులు హీరో తనీష్ ని మనీ లాండరింగ్‌ కోణంలో అనుమానాస్పద లావాదేవీల గురించి ఆరా తీస్తున్నారు. బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. అలాగే డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో తనీష్ కి  ఉన్నాయా? ఈ కేసులో ప్రధానమైన ఎఫ్‌ క్లబ్‌లో జరిగే పార్టీలకు తనీష్ ఎప్పుడైనా హాజరయ్యాడా.. ఎఫ్ క్లబ్బు లో డ్రగ్స్ లు చేతులు మారాయా, ఎవరెవరు ఎఫ్ క్లబ్బు పార్టీలకు హాజరయ్యేవారు? అనే కోణంలో తనీష్ ని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. 

Hero Tanish at ED Office:

Hero Tanish At ED Office For Investigation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ