అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో మొదలైన పుష్ప సినిమా షూటింగ్ మారేడుమిల్లు అడవులు, కాకినాడ పోర్ట్ సమీపంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కాకినాడ లో పుష్ప షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ కి చేరుకొని సాయి ధరమ్ తేజ్ ని అపోలో హాస్పిటల్ లో పరామర్శించారు. అయితే పుష్ప సినిమా మొదలైనప్పటినుండి పుష్ప టీం సెట్స్ నుండి లీకుల బెడదతో సతమతమవుతోంది. పుష్ప సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు, అల్లు అర్జున్ లుక్స్ ఎప్పటికప్పుడు లీకైపోయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మధ్య వచ్చే ఒక సీన్ లీక్ అయిన విషయం తెలిసిందే. అవుట్ డోర్ షూట్ లో షూటింగ్ చూడడానికి వచ్చే జనాలు, హీరో అభిమానులను అదుపు చెయ్యడం తలకు మించిన భారంగా మారిందట. వారు షూటింగ్ సీన్స్ ని సెల్ ఫోన్స్ లో బందించి వాటిని సోషల్ మీడియాలో లీక్ చెయ్యడం పుష్ప టీం కి కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. దానితో సెట్స్ లోకి ఫోన్స్ తెచ్చినా.. చుట్టుపక్కల ఎవరి చేతిలో సెల్ల్ ఫోన్స్ ఉన్నా, ఫొటోస్ తీసినా, వీడియోస్ తీసినా ఫోన్స్ పగలగొట్టబడును అంటూ ఓ బోర్డు తయారు చేయించి పుష్ప సెట్స్ దగ్గర తగిలించారు. ఇప్పడు ఆ బోర్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.