తెలంగాణాలో థియేటర్స్ అన్ని బాగా రన్ అవుతున్నాయి. ఇక్కడ సమస్యలను మంత్రి తలసాని ఎప్పటికప్పుడు తీరుస్తున్నారు. కానీ పక్క రాష్ట్రం ఆంధ్రలో మాత్రం థియేటర్స్ సమస్యలు ఓ కొలిక్కి రావడం లేదు. మరోపక్క జగన్ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ విషయంలో దిగి రావడం లేదు. దానితో ఇండస్ట్రీ పెద్దలైన చిరు, నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు, రాజమౌళి, కొరటాల లాంటి వారు జగన్ ని కలిసి సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించాలని చూస్తున్నారు. కొన్ని రోజులుగా సీఎం జగన్ అప్పాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రముఖలకి ఏ నెల 20 న జగన్ ని కలిసే భాగ్యం దక్కింది. కరోనా తో సినిమా ఇండస్ట్రీ పడుతున్న కష్టాలను ఈ మీటింగ్ లో ఏకరువు పెట్టబోతున్నారు.
అయితే తాజాగా మెగాస్టార్ చిరు మెగా ప్లాన్ చేసారని తెలుస్తుంది. అంటే ఎప్పుడూ ప్రభుత్వాల దగ్గరకు చిరు, నాగ్, సురేష్ బాబు, దిల్ రాజు, రాజమౌళి లాంటి పెద్దలే వెళుతున్నారు కానీ.. స్టార్ హీరోలెవరు ఈ మీటింగ్ కి రావడం లేదు. కానీ ఈసారి జగన్ తో సినిమా ప్రముఖుల మీటింగ్ కి స్టార్ హీరోలైన మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లని కూడా తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారట. అందుకే చిరు ప్రత్యేకంగా స్టార్ హీరోలకి ఫోన్స్ చేసి మరీ విషయం వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఖచ్చితంగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో జరగబోయే మీటింగ్ లో పాల్గొనాలని ఇండస్ట్రీ సమస్యలపై కూడా వారి గొంతును కూడా వినిపించాలని మెగాస్టార్ చిరు వారికి చెప్పినట్లుగా టాక్. మరి చిరు మెగా ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం.