Advertisementt

సాయి ధరమ్ ని పరామర్శించిన అల్లు అర్జున్

Thu 16th Sep 2021 07:46 PM
allu arjun,rushes to meet,sai dharam tej,apollo hospital,sai tej health condition  సాయి ధరమ్ ని పరామర్శించిన అల్లు అర్జున్
Allu Arjun rushes to meet Sai Dharam Tej సాయి ధరమ్ ని పరామర్శించిన అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

వినాయక చవితి రోజున స్పోర్ట్స్ బైక్ తో రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఇంకా అపోలో హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నాడు. సాయి ధరమ్ కి యాక్సిడెంట్ అయినది అన్న విషయం తెలియగానే మెగాస్టా చిరు, పవన్ కళ్యాణ్ ఇంకా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలి వచ్చారు. అల్లు అరవింద్ కూడా సాయి ధరమ్ తేజ్ పరామర్శ కోసం హాస్పిటల్ కి వచ్చారు. కానీ అల్లు అర్జున్ మాత్రం పుష్ప షూటింగ్ కోసం కాకినాడ వెళ్లడంతో రాలేకపోయాడు. అసలు సాయి ధరమ్ కి యాక్సిడెంట్ అయింది అని మెగాస్టార్ కి ఇంఫామ్ చేసిందే అల్లు అర్జున్ అని చెప్పారు. తనకి న్యూస్ రావడంతో వెంటనే చిరు కి అల్లు అర్జున్ ఫోన్ చేసాడని అంటున్నారు. ఇక గత వారం రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న సాయి ధరమ్ కొద్దీ కొద్దిగా కోలుకుంటున్నాడు.

కాకినాడ, మారేడుమిల్లు ఫారెస్ట్ లో పుష్ప షూటింగ్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ కి వచ్చిన అల్లు అర్జున్ ముందుగా సాయి ధరమ్ తేజ్ ని పరామర్శించడానికి అపోలోకి వెళ్ళాడు. అక్కడ సాయి ధరమ్ ని పరామర్శించి ఆయన ఆరోగ్యంపై డాక్టర్స్ ని కనుక్కున్నారు. సాయి ధరమ్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుంది అని, ఇంకా ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది అని, షోల్డర్ బోన్ కి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అని.. మరో రెండు రోజుల్లో సాయి ధరమ్ ని జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేస్తామని అపోలో వైద్యులు తెలిపారు. 

Allu Arjun rushes to meet Sai Dharam Tej:

Allu Arjun rushes to meet Sai Dharam Tej at Apollo Hospital

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ