రాజమౌళి నుండి రాబోయే ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా ఫిలిం కోసం అన్ని భాషా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆర్.ఆర్.ఆర్ ని వీక్షిద్దామా అని స్టార్ హీరోల ఫాన్స్ వెయిటింగ్. ఇక బాహుబలితో బాలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చేసిన రాజమౌళిని చూస్తే అక్కడి హీరోలే భయపడిపోతున్నారు. అందుకే ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడు వస్తుందో.. అని బాలీవుడ్ ప్రేక్షకులు వెయిటింగ్. అదంతా అలా ఉంటే... ఇప్పుడు రాజమౌళి ఓ స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ చేయబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ తో మూవీ చెయ్యాల్సి ఉంది. మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ కి కమిట్ అయ్యారు.
అంటే ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ రాజమౌళికి దొరికేలా లేరు. దానితో జక్కన్న ఆర్.ఆర్.ఆర్ కి మహేష్ మూవీకి మద్యన ఓ బాలీవుడ్ ఫిలిం చెయ్యాలని చూస్తున్నారట. చాలా తక్కువ టైం లో చాలా తక్కువ బడ్జెట్ తో బాలీవుడ్ నటీనటులు, బాలీవుడ్ టెక్నీకల్ సిబ్బందితో రాజమౌళి ఓ హిందీ ఫిలిం ప్లాన్ చేయబోతున్నారనే న్యూస్ మొదలైంది. బాలీవుడ్ నటీనటులు కనిపించబోయే ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ అయితే ఉండరని.. చాలా తక్కువ బడ్జెట్ తో ఓ ప్రయోగాత్మక చిత్రానికి రాజమౌళి సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా టాక్.