చాలామంది హీరోయిన్స్ పర భాషల నుండి సౌత్ సినిమాలలో నటించడమే కాదు.. సౌత్ నుండి బాలీవుడ్ కి వెళ్లడమో, బాలీవుడ్ నుండి సౌత్ కి రావడమో చేస్తుంటారు. తాము ఒప్పుకున్న సినిమాల కోసం హోటల్ రూమ్స్ లో గడిపేస్తుంటారు. షూటింగ్ ఫినిష్ అవ్వగానే హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఈ ఖర్చంత నిర్మాతే భరిస్తారు. అయితే ఇప్పుడొక హీరోయిన్ హోటల్ రూమ్స్ లో ఉండడం ఇష్టం లేదంటుంది. అందుకే ఇల్లు కొనేసిందట. ఆమె ఎవరో కాదు.. కన్నడ నుండి హైదరాబాద్ కి మకాం మార్చి.. తాజాగా బాలీవుడ్ మూవీస్ కోసం ముంబై షిఫ్ట్ అవ్వబోతున్న రష్మిక మందన్న. తెలుగులో పుష్ప పాన్ ఇండియా మూవీ, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ చేస్తుంది.
ఇక బాలీవుడ్ లో రష్మిక మూడు నాలుగు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ తో బిజీగా వుంది. అందుకే ముంబై హోటల్స్ లో ఉండడం ఇష్టం లేక ముంబై లో ఓ ఫ్లాట్ కొనేసిందట ఈ చిన్నది. ఎక్కువ రోజులపాటు హోటల్‌లో ఉంటడం ఇష్టం లేదు. అందుకే ముంబైలో ఓ ఇల్లు కొనుగోలు చేశాను. ఆ ఇంటి నుండి షూటింగ్స్ కి హాజరవడం సౌకర్యంగా ఉంది అని చెప్పుకొచ్చింది రష్మిక. అంతేకాదు.. ఎప్పుడూ తన ఫ్యామిలీతో కలిసి ఉండడమే ఇష్టం అని, తనకి తన చెల్లెలికి 16 సంవత్సరాల వయస్సు తేడా ఉంది అని.. తన చెల్లెకి తానే రెండో తల్లి అని తెలిపింది. అయితే ముంబై లో తన అపార్ట్‌మెంట్ లోపల ఇంటీరియర్ డిజైనింగ్ తానే చేసినట్లు రష్మిక చెప్పుకొచ్చింది. ఇక బాలీవుడ్ రష్మిక నటించిన ఓ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్స్ లో బిజీగా వుంది.