సైదాబాద్ సింగరేణి కాలనిలో చిన్నారి ని అత్యాచారం చేసి, మర్డర్ చేసిన కేసులో నిందితుడైన రాజు పోలీస్ లకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. చిన్నారిని పాశవికంగా అత్యాచారం చేసి.. ఏమి తెలియని అమాయకుడిలా చిన్నారి కుటుంబంతో కలిసిపోయిన రాజు.. తనపై అనుమానం రాగానే పారిపోయాడు. అప్పటి నుండి పోలీస్ లకి చిక్కకుండా తప్పించుకుపోతున్నాడు. రాజుని పట్టుకోవడానికి పోలీస్ లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోపక్క రాజకీయ, సినీ ప్రముఖులు చిన్నారికి న్యాయం జరగాలంటూ పోరాడుతున్నారు.
ఇక రాజుని పట్టించి ఇచ్చినవాళ్ళకి 10 లక్షల రివార్డ్ కూడా ప్రకటించారు పోలీస్ లు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ పర్సనల్ గా రాజు ని పట్టి తెచ్చినవారికి 50, 000 ఇస్తానని ప్రకటించారు. అయితే తాజాగా చిన్నారి అత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అటుగా వెళుతున్న రాజుని గుర్తుపట్టిన రైల్వే కీమెన్లు తనని పట్టుకోవడానికి వస్తున్నారని భయంతో రాజు వరంగల్ స్టేషన్ ఘన్ పూర్ రైలు పట్టాలవెంట పరిగెత్తుతూ అటుగా వస్తున్న రైలు ఢీకొని చనిపోయినట్లుగా రైల్వే కీమెన్లు చెబుతున్నారు.
రాజారామ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద రాజు మృతదేహం దొరికినట్లుగా పోలీస్ లు చెబుతున్నారు. అతని చేతి మీదున్న మౌనిక అనే పచ్చ బొట్టు ఆధారంగా అతను రాజు అని నిర్ధారణకు వచ్చారు పోలీస్ లు. రాజు మృతదేహాన్ని ఎంజిఎం కి తరలించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.