పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కాంబోలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ అన్ని తానై తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ లుక్, పవన్ పోలీస్ డ్రెస్, పవన్ కళ్యాణ్ పొగరుని టీజర్ ద్వారా రివీల్ చేసారు. దానితో భీమ్లా నాయక్ పై విపరీతమైన అంచనాలు మొదలైపోయాయి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని హైలెట్ చేస్తున్నారు తప్ప మరో హీరో రానాని పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పాత్రకి సమానమైన పాత్రలో రానా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు పవన్ మీదే టైటిల్, అండ్ సాంగ్, అండ్ టీజర్ వదిలిన టీం రానా ని లైట్ తీసుకుంటుంది అంటూ రానా అభిమానులు ఫీలవుతున్నారు.
తాజాగా రానా పాత్ర డానియల్ శేఖర్ ఫస్ట్ లుక్ లేదా ఫస్ట్ గ్లింప్స్ ని వదలడానికి భీమ్లా నాయక్ టీం డేట్ ఫిక్స్ చేసింది అంటున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన రానా పాత్ర తాలూకు లుక్ కానీ, గ్లిమ్బ్స్ కానీ వదలబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. ఇంతవరకు మేకర్స్ నుండి ఎలాంటి ప్రకటన అయితే లేదు. కానీ ఈసారి రానా పాత్ర రివీల్ అవడం పక్కా అంటున్నారు. ఈ సినిమాలో పవన్ వైఫ్ గా నిత్య మీనన్, రానా వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.