ఎప్పటినుండో ప్రేక్షకుల్లో, ఫాన్స్ లో తలెత్తే అతి పెద్ద ప్రశ్న.. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అని. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ మధ్యలో దోబూచులాడే ఈ నెంబర్ 1 చైర్ గేమ్ లో పవన్ రాజకీయాలతో పక్కకెళ్ళిపోయారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇక మహేషే టాలీవుడ్ నెంబర్ వన్ అంటున్నారు. తాజాగా పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా సర్వ్ లో టాలీవుడ్ నెంబర్ వన్ ప్లేస్ ని మహేష్ చేజిక్కించుకున్నారు. ఆగస్టు నెలకు గాను ఆర్మాక్స్ మీడియా సర్వ్ లో టాలీవుడ్ లో నెంబర్ వన్ గా మహేష్ బాబు ఉంటె.. నెంబర్ 2 లో అల్లు అర్జున్ ఉన్నారు. మహేష్ సర్కారు వారి పాటతో టాలీవుడ్ కి సరిపోయే సినిమా చేస్తుంటే అల్లు అర్జున్ పుష్ప అంటూ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు.
ఇక 3 వ స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉంటే.. నాలుగో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. 5, 6 స్థానాలను ఆర్.ఆర్.ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సరిపెట్టుకున్నారు. గతంలో నాలుగో స్థానంలో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయాడు. 7 వ స్థానంలో నేచురల్ స్టార్ నాని, 8 వ స్థానంలో లైగర్ తో పాన్ ఇండియా కి వెళుతున్న విజయ్ దేవరకొండ, 9 వ స్థానంలో చిరు, 10 వ స్థానాల్లో వెంకీ లు ఉండడం గమనార్హం.