సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కి న్యాయం జరగాలంటూ టాలీవుడ్ స్టార్ హీరోస్ మహేష్, మంచు మనోజ్, పూజ హెగ్డే, నిఖిల్ లు పిలుపునివ్వగా.. పొలిటికల్ లీడర్స్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. షర్మిల, కోమటిరెడ్డి, మరికొంతమంది పొలిటిషన్స్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి న్యాయం జరిగే వరకు, దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
బుధవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్నిపరామర్శించారు. ఆ తర్వాత మీడియా తో మాట్లాడిన పవన్ చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకు నా విన్నపం.. మంత్రి వర్గంలోని పెద్దలను పంపి బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు భరోసా కల్పించండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు ఓదార్పు అవసరం. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయగలమో ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాను.. అని మీడియా బాధ్యతగా వ్యవహరించాలి అంటూ మాట్లాడారు.
అసలు ఇంతవరకు నిందితుడు దొరకలేదని, తమకు న్యాయం జరగలేదని చిన్నారి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు నా తరఫున ఓ విన్నపం. బిడ్డ చనిపోయిన బాధలో ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద మనసుతో అర్ధం చేసుకోవాలి అంటూ విన్నవించారు పవన్. ఇక పవన్ అక్కడికి రావడంతో ఆయన్ని చూసేందుకు అభిమానులు గుమిగూడారు. అక్కడ పవన్ ని చూసే క్రమంలో చిన్నపాటి తోపులాట కూడా జరిగింది.