పూరి జగన్నాధ్ - ఛార్మి - కరణ్ జోహార్ నిర్మాతలుగా.. పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న లైగర్ మూవీ కరోనా సెకండ్ వేవ్ లేకపోతె.. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది. కానీ సెకండ్ వేవ్ కరోనా, మధ్యలో పూరి అండ్ ఛార్మీలను ఈడీ విచారణకు పిలవడంతో లైగర్ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఇప్పటి వరకు ముంబై పరిసర ప్రాంతాల్లోనే లైగర్ షూటింగ్ జరిపిన పూరి జగన్నాధ్ తాజా షెడ్యూల్ గోవా లో ప్లాన్ చేసారు. ఇప్పటికే పూరి అండ్ ఛార్మి మూవీ యూనిట్ గోవాకి చేరుకున్నారు.
తాజాగా లైగర్ మూవీ అప్ డేట్ ఇచ్చేసారు. Back to the ring .. 💥👊🏻 With the motto 👇🏻📢 BLOOD🩸 SWEAT💧 VIOLENCE🥊 లైగర్ రింగ్ లోని వచ్చేసాడు అంటూ విజయ్ దేవరకొండ బ్యాక్ లుక్ ని వదులుతూ అప్ డేట్ ఇచ్చేసింది టీం. ఇక ఫుల్ స్వింగ్ లో లైగర్ చిత్రీకరణను గోవా లో పూర్తి చేస్తారట. ఈ సినిమాలో అనన్య పాండే విజయ్ దేవరకొండ కి జోడిగా నటిస్తుంటే.. రమ్యకృష్ణ, సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న లైగర్ సాలా కా బ్రీడ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.