Advertisementt

ఓటిటి vs థియేటర్స్ మరోసారి

Wed 15th Sep 2021 12:08 PM
nithin,sundeep kishan,maestro movie,gully rowdy movie,maestro vs gully rowdy  ఓటిటి vs థియేటర్స్ మరోసారి
OTT vs Theaters ఓటిటి vs థియేటర్స్ మరోసారి
Advertisement
Ads by CJ

గత వారం నాని టక్ జగదీశ్ ఓటిటి నుండి విడుదల కాగా.. గోపీచంద్ సీటిమార్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అప్పుడే ఓటిటి vs థియేటర్స్ అన్నట్టుగా సాగిన సమరంలో థియేటర్స్ లో రిలీజ్ అయిన గోపీచంద్ సీటిమార్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నాని టక్ జగదీశ్ కి పాజిటివ్ టాక్ వచ్చినా ప్లాప్ లిస్ట్ లో పడిపోయింది. ఇక ఈ వారం మరోసారి ఓటిటి vs థియేటర్స్ అన్నట్టుగా నితిన్ మ్యాస్ట్రో మూవీ.. ఓటిటి నుండి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంటే.. సందీప్ కిషన్ గల్లీ రౌడీ థియేటర్స్ లో దిగుతుంది. బాలీవుడ్ హిట్ మూవీ అంధధూన్ కి రీమేక్ గా తెరకెక్కిన మ్యాస్ట్రో పై భారీ అంచనాలే ఉన్నాయి. 

ఇక సందీప్ కిష‌న్ - జి.నాగేశ్వ‌ర‌రెడ్డి కాంబోలో తెరకెక్కిన గల్లీ రౌడీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ పరంగాను గల్లీ రౌడీ దూసుకుపోతుంది. ఇంకా గల్లీ రౌడీ తో పాటుగా సెప్టెంబర్ 17 శుక్రవారం విజ‌య్ ఆంటోనీ విజ‌య్ రాఘ‌వ‌న్‌, హ‌ర్బ‌జ‌న్ సింగ్ ఫ్రెండ్ షిప్‌, శ్రీనివాస్ రెడ్డి ప్లాన్ బి సినిమాలు థియేట‌ర్ల‌లోనే రిలీజ్ కాబోతున్నాయి. మరి గతవారం ఓటిటి ప్లాప్ అయితే.. థియేటర్స్ హిట్ కొట్టాయి. మరి ఈవారం ఎలా ఉంటుందో చూడాలి. 

OTT vs Theaters:

Maestro vs Gully Rowdy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ