టాలీవుడ్ లో 12 మంది సెలబ్రిటీస్ తమకి కేటాయించిన తేదీల్లో ఈడీ ఆఫీస్ కి మనీ లాండరింగ్ కేసు విచారణ కోసం హాజరవుతున్నారు. ఇప్పటికే పూరి, ఛార్మి, రవితేజ, నవదీప్, రానా, రకుల్, నందులు ఈడీ ఎదుట విచారణకు హాజరవగా.. నేడు బుధవారం నటి ముమైత్ ఖాన్ ఈడీ ఎదుట హాజరవడం కోసం ఈడీ ఆఫీస్ కి వచ్చింది. గతంలోనూ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన ముమైత్ ఖాన్, బిగ్ బాస్ హౌస్ లో నుండి ఈ కేసు విచారణకు బయటికి వచ్చింది.
ఇక మనీ లాండరింగ్ కేసులో ముమైత్ ఖాన్ ఈడీ అధికారుల ఎదుట హాజరైంది. ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీ, డ్రగ్స్ సరఫరా దారుడు కెల్విన్ తో సంబంధాలు, కెల్విన్ నుండి ముమైత్ ఖాన్ అధిక మొత్తం డ్రగ్స్ కొను గోలు ,చేసినట్లుగా అనుమానాలు, ముమైత్ ఖాన్ బ్యాంకు లావాదేవీలు, మని ట్రాన్సిక్షన్స్ పై ముమైత్ ఖాన్ ని ఈడీ ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తుంది. నవదీప్ విచారణ, రవితేజ, రానా ల విచారణ కి కెల్విన్ ని కూడా కలిపి ఈడీ అధికారులు విచారించారు. ఇక ఇప్పటివరకు ఈడీ విచారణలో పాల్గొన్న సెలబ్రిటీస్ కెల్విన్ ఎవరో తెలియదని, వారి బ్యాంకు అకౌంట్స్ ని ఈడీ అధికారులకి చూపించినట్లుగా తెలుస్తుంది.