చిరంజీవి - కొరటాల శివ కాంబోలో భారీ బడ్జెట్ తో మొదలైన ఆచార్య మూవీ లో చిరు కి జోడిగా త్రిషని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఆచార్య షూటింగ్ మొదలయ్యి.. త్రిష కూడా షూటింగ్ లో పాల్గొంటున్న టైం లో సడన్ గా త్రిష ఆచార్య మూవీ నుండి తప్పుకుంది. అప్పట్లో రకరకాల న్యూస్ త్రిష పై చక్కర్లు కొట్టాయి. ఇక అప్పుడు ఆచార్య ని వద్దనుకున్న త్రిష ఇప్పుడు అదే చిరు తో మరో మూవీ ఒప్పుకుంటుందా అనే అనుమానం ఉంది. మరోపక్క బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీ కోసం త్రిషని హీరోయిన్ గా అనుకుని ఆమెని సంప్రదించబోతున్నారని అంటున్నారు.
ఇక తాజాగా చిరు - మెహర్ రమేష్ కాంబోలో మొదలు కాబోతున్న భోళా శంకర్ మూవీ కి కోసం చిరు కి జోడిగా త్రిషని సంప్రదించబోతున్నారట. చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంటే.. ఈ సినిమాలో హీరోయిన్ తమ్ముడు చిరు చెల్లెలిని ఇష్టపడతాడు. అయితే ఇప్పుడు హీరోయిన్ పాత్ర కోసమే త్రిషని సంప్రదిస్తున్నారట. మరి ఆచార్య లో చిరు పక్కన వద్దనుకున్న త్రిష ఇప్పుడు భోళా శంకర్ లో నటిస్తుందా? గతంలో చిరు తో స్టాలిన్ సినిమా చేసినప్పుడు బరువు పెరిగిన చిరు పక్కన త్రిష హీరోయిన్ గా తేలిపోయింది. అంత జరిగాక ఇప్పుడు భోళా శంకర్ లో చిరు సరసన త్రిష నిడివి తక్కువ ఉన్న హీరోయిన్ కేరెక్టర్ లో నటిస్తుందో.. లేదో చూడాలి.