ప్రభాస్ - కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ మూవీ కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ సెట్ లో జరుగుతుంది. పక్కా మాస్ కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న సలార్ సినిమా యాక్షన్ సన్నివేశాలును చిత్రీకరిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొంటుంది. అలాగే కీలక పాత్రధారులు జగపతి బాబు ఇంకొంతమందిపై ఈ యాక్షన్ సన్నివేశాల షూట్ జరుగుతుంది. అయితే సినిమాకి ఇప్పుడు పెడుతున్న బడ్జెట్ లో సగ భాగం ఈ యాక్షన్ సన్నివేశాలకు ఖర్చు చేస్తున్నారట.
ఈ యాక్షన్ సన్నివేశాలే సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలవబోతున్నాయట. ఈ యాక్షన్ పార్ట్ ని ప్రశాంత్ నీల్ కొత్తగా తెరకెక్కిస్తున్నారని, రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తున్న ఈ షెడ్యూల్.. సినిమాలో మేజర్ షెడ్యూల్ అని అంటున్నారు. ఇక తాజాగా సలార్ సెట్స్ లో అడుగుపెట్టిన శృతి హాసన్ చిలిపి అల్లరి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ని పొగిడెయ్యడమే కాదు.. ఆయనకు చిరాకు తెప్పించేసే పనులతో ప్రశాంత్ నీల్ ని ఆటపట్టించింది శృతి హాసన్.
తనకు ఇష్టమైన వ్యక్తిని తనకు ఇష్టమొచ్చినట్టుగా చేయడం ఇంకా ఎంతో ఇష్టమని శ్రుతీ హాసన్.. సలార్ సెట్స్ లో అల్లరల్లరి చేసేసింది.