గత కొన్ని రోజులుగా బాలకృష్ణ అఖండ మూవీ డేట్ కోసం నందమూరి ఫాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో మే లో రిలీజ్ అవ్వాల్సిన బాలకృష్ణ - బోయపాటి కాంబో అఖండ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? ఎప్పుడు డేట్ ఇస్తారా? అని ఫాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. అయితే దసరా బరిలో అఖండ అన్నప్పటికీ మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. కారణం అఖండ సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ ఉందట. అఖండ పాటల షూటింగ్ పూర్తయ్యాకే సినిమా రిలీజ్ డేట్ ఇవ్వాలని బోయపాటి చూస్తున్నారట.
ప్రస్తుతం ఆ సాంగ్స్ చిత్రీకరణ కోసమే బాలకృష్ణ అండ్ టీం గోవా పయనమైంది. అక్కడ గోవాలో భారీ సెట్ వేసి అఖండ సాంగ్ షూట్ చేస్తారని అంటున్నారు. ఈ సాంగ్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. అలాగే అఖండ లోని మరో సాంగ్ ని కూడా మాసివ్ లెవెల్లో ఈ మంత్ ఎండ్ న ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో.. షూటింగ్ మొత్తం ఫినిష్ అయ్యాకే అఖండ రిలీజ్ డేట్ వస్తుంది.