బిగ్ బాస్ సీజన్ 5 మొదలై కేవలం ఓ వారం మాత్రమే అయ్యింది. అప్పుడే బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ రంగులని బయట పెట్టేసింది బిగ్ బాస్. గత రాత్రి నామినేషన్స్ ప్రక్రియలోని చాలామంది రంగులు బయట పడ్డాయి. లోబో, రవి, నటరాజ్, భాగ్యం, యాని ఇలా చాలామంది ఓపెన్ అయ్యారు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో మిగతా కొంతమంది రంగులు బయటపడ్డాయి. అయినా నామినేషన్స్ అయ్యాక ఇద్దరిద్దరు చొప్పున కూర్చుని ఈ నామినేషన్స్ పై చర్చిస్తున్నారు. రవి అయితే లోబో నన్ను ఎప్పటికి నామినేట్ చెయ్యను అన్నాడు కానీ.. చేసాడు.
ఇక శ్వేత హామీదకి నేను హౌస్ లో కనిపించలేదట. అర్ధపావు భాగ్యాన్ని మీరు బూతులు కరెక్ట్ చేసుకోండి అని సన్నీ అంటే.. నేను ఇలానే ఉంటాను, నేను నా మొగుడితో కూడా ఇలానే మాట్లాడతాను అంటూ రెచ్చిపోయింది. షణ్ముఖ్, సిరి కెప్టెన్సీ టాస్క్ లో రెచ్చిపోయారు. ఇక పిల్లోడు పిల్లోడు అంటున్న జెస్సి కూడా కెప్టెన్ అవడం కోసం పోరాడడమే కాదు.. కావాలని తొక్కేశారంటూ జెస్సి వాళ్లెవరో తర్వాత చెబుతా అంటున్నాడు. శ్రీరామ చంద్ర - రవి టాస్క్ లో గొడవపడుతున్నారు.
నటరాజ్ మాస్టర్, ప్రియా.. ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి ముసుగువేసుకుని వచ్చిన వారి అసలు రంగులు ఒక్కొక్కటిగా బయటపడిపోతున్నాయి. కేవలం రెండు వారాల్లోనే ఇలాంటివి కనిపిస్తే.. ఇక మిగతా వారాల్లో వాళ్ళ నిజ స్వరూపాలు బిగ్ బాస్ ప్రేక్షకులకు తేటతెల్లమైపోవడం ఖాయం.