రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని ఎట్టి పరిస్తితుల్లో అక్టోబర్ 13 నే రిలీజ్ చేస్తాను అని చెప్పి.. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ ఓపెన్ అవలేదు.. సో సినిమాని వాయిదా వేస్తున్నామని కూల్ గా చెప్పారు. ఇక ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి.. ఉన్నట్టుండి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఓ టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్స్ తో మీటింగ్ పెడితే అందులో వింతేమీ ఉండదు.. ఆ కాంబోలో ఓ మూవీ వస్తుంది అని ఫిక్స్ అవుతారు.
కానీ ఇక్కడ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ తో మూవీ చెయ్యాల్సి ఉంది. దానికి నిర్మాత వేరే ఉన్నారు. ఇక మహేష్ సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తో మూవీ చెయ్యబోతున్నాడు. దాని తర్వాతే రాజమౌళి మూవీ ఉండొచ్చు. మరి ఈలోపు రాజమౌళి - మైత్రి మూవీ మేకర్స్ మీటింగ్ ఎందుకో అనే అనుమానం ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అంటే ఇండియాలో ఇంతవరకు ఎవరు పెట్టని బడ్జెట్ తో మైత్రి వారు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో భారీ బడ్జెట్ పెట్టి ఓ మూవీ చెయ్యాలని అనుకుంటున్నట్లుగా సోషల్ మీడియా టాక్.
మరి మహేష్ వచ్చేవరకు రాజమౌళి వెయిట్ చేస్తారా? లేదంటే మధ్యలో మైత్రి వారితో ఓ మూవీ చేస్తారో? అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు మొదలైపోయాయి.