Advertisementt

ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మాలని సినీప్రముఖులే కోరారు

Tue 14th Sep 2021 04:47 PM
ap minister,perni nani,movie tickets  ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మాలని సినీప్రముఖులే కోరారు
AP minister Perni Nani responds to movie tickets issue ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మాలని సినీప్రముఖులే కోరారు
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను విక్రయించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ అంశంపై కమిటీలు వేశామని, అధ్యయనం జరుగుతోందని మంత్రి చెప్పారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. సినిమా టికెట్లను విక్రయించనున్న విషయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. దుష్ప్రచారాలు మానుకోవాలని నాని హెచ్చరించారు. 

జగన్ ప్రభుత్వం మంచి పని ఏది చేపట్టినా విపక్షాలు విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మాలని సినీ ప్రముఖులే కోరారని.. సినీ పెద్దల సూచనలే ప్రభుత్వం పరిశీలించిందని మంత్రి స్పష్టం చేశారు. బ్లాక్‌ టిక్కెట్లు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతో త్వరలోనే  భేటీ అవనున్నట్లు నాని వెల్లడించారు. పన్ను ఎగవేత జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం గమనించిందన్నారు. త్వరలోనే సినిమా ప్రమయూఖులతో ఏపీ సీఎం జగన్ భేటీ అవుతారని.. అప్పుడు సినిమా పరిశ్రమలోను సమస్యలను, టికెట్ రేట్స్ విషయమై చర్చిస్తారని పేర్ని నాని చెప్పారు. 

AP minister Perni Nani responds to movie tickets issue:

Minister Perni Nani responds to movie tickets issue, says tickets will be sold transparently

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ