Advertisementt

ఇండస్ట్రీ పెద్దలని కరుణించిన ఏపీ సీఎం

Tue 14th Sep 2021 02:27 PM
tollywood,delegation meet,chiranjeevi,nagarjuna,suresh babu,rajamouli,ap cm jagan  ఇండస్ట్రీ పెద్దలని కరుణించిన ఏపీ సీఎం
Date fixed for Tollywood delegation meet with AP CM ఇండస్ట్రీ పెద్దలని కరుణించిన ఏపీ సీఎం
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం జగన్ ని కలిసేందుకు ఇండస్ట్రీ పెద్దలైన చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, ఇంకా బడా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ లో థియేటర్ వ్యవస్థ, తాజాగా ఏపీలో థియేటర్స్‌ టికెట్స్ రేట్స్ పాటు.. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ రంగం ఎదుర్కొంటోన్న పలు సమస్యల విషయాలు జగన్ తో మట్లాడాలని ఇండస్ట్రీ పెద్దల ఆలోచన. కరోనా కష్ట కాలంలో ఇండస్ట్రీ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంది. కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను, బెన్ఫిట్ షోస్ కి అనుమతులు తదితర అంశాలను జగన్ ముందు పెట్టాలని తిరుగుతున్నారు.

కొన్నాళ్లుగా జగన్ ఇండస్ట్రీ పెద్దలకై అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. మధ్యలో ఏపీ మంత్రి పేర్ని నాని ఇండస్ట్రీ పెద్దలకి, ఏపీ సీఎం కి మధ్యవర్తిత్వం వహిస్తూ ఎట్టకేలకి ఈ నెల 20న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసేందుకు చిరంజీవి నేతృత్వంలోని బృందానికి అపాయింట్మెంట్ ఖరారు చేసారు. ఈ విషయాన్ని మంత్రి పేర్నినాని మీడియాకు తెలియజేసారు, చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు ఏపీ సీఎం జగన్‌ను ఈ నెల 20 న కలవనున్నారు.

Date fixed for Tollywood delegation meet with AP CM :

Date fixed for Tollywood delegation meet with Ap CM Jagan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ