Advertisementt

సండే ప్రకాష్ రాజ్ - మండే మంచు విష్ణు పార్టీ

Tue 14th Sep 2021 02:12 PM
prakash raj,maa members,manchu vishnu,dinner party,maa members at park hyatt  సండే ప్రకాష్ రాజ్ - మండే మంచు విష్ణు పార్టీ
Manchu Vishnu time to organise a dinner party with MAA members at Park Hyatt సండే ప్రకాష్ రాజ్ - మండే మంచు విష్ణు పార్టీ
Advertisement
Ads by CJ

మా ఎన్నికల రాజకీయాలు మొత్తం.. పార్టీల చుట్టూ తిరుగుతున్నాయి. ఇండస్ట్రీలోని మా సబ్యులని పిలిచి మా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు లు ఇస్తున్న పార్టీలు హాట్ టాపిక్ గా మారాయి. వీరి మధ్యలో ప్రస్తుత మా అధ్యక్షుడు ఇచ్చిన వీకెండ్ పార్టీ మరింత వేడిని రాజేసింది. ఆదివారం ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మా సబ్యులని పిలిచి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో విందు ఏర్పాటు చేసి.. మా సభ్యుల సమస్యలని తెలుసుకుని తన ప్రచారం చేసుకున్నారు. 

ప్రకాష్ రాజ్ పార్టీ ఆదివారం అయితే.. మంచు విష్ణు సోమవారం రాత్రి హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో డిన్నర్ పార్టీ ఇచ్చాడు. మా భవనం కట్టడం దగ్గర నుండి, తాను మా అద్యక్షకుడిగా ఎన్నికైతే ఏం చేస్తాడో.. చెయ్యగలడో అనేది పార్టీ కి హాజరయిన దాదాపు 100  సభ్యులకి వివరించాడు మంచు విష్ణు. అయితే మా ఎన్నికల విషయం మొత్తం ఇలా పార్టీల చుట్టూ తిరగడం, విందులు పార్టీలు అంటూ మేటర్ మొత్తం డైవర్ట్ అవడంతో కొంతమంది ఈ మా ఎన్నికలు అయ్యేలోపు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అంటున్నారు. 

Manchu Vishnu time to organise a dinner party with MAA members at Park Hyatt:

Prakash Raj lunch meeting with MAA members, it is now Manchu Vishnu time to organise a dinner party with MAA members at Park Hyatt

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ