సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయిన తర్వాత సీనియర్ హీరో నరేష్ సాయి తేజ్ బైక్ రేసింగ్, ఆయన బైక్ నడిపే స్పీడు మీద చేసిన ఓ వీడియో బైట్ హాట్ టాపిక్ అవ్వగా.. సాయి ధరమ్ యాక్సిడెంట్.. ఆయన స్పీడు గా బైక్ డ్రైవ్ చెయ్యడం వలన జరగలేదు, వీడియో బైట్స్ వదిలేముందు కొంచెం ఆలోచించండి, అసలే యాక్సిడెంట్ తో సాయి ధరమ్ కుటుంబ సభ్యులు టెంక్షన్ లో ఉన్నారు. ఇలాంటప్పుడు నరేష్ గారు వదిలిన వీడియో బైట్ ఆ ఫ్యామిలీని బాధపెట్టింది అంటూ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలకు నరేష్ తాజాగా కాంటర్ ఇచ్చారు.
హీరో శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలతో నేను హార్ట్ అయ్యాను. పిల్లకి చాకలేట్స్ ఇచ్చినట్లుగా బైక్స్ ఇవ్వము, అయినా సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ చేసేటప్పుడు అతి వేగంగా బైక్ నడపలేదు. నేను ముందే చెప్పాను, అయినా శ్రీకాంత్ మా ప్యానల్ లో పోటీ చేసి ఓడిపోయావు. ఇలాంటి మాటలు మట్లాడేటప్పుడు, వీడియో బైట్స్ ఇచ్చేటప్పుడు పెద్దల సలహా తీసుకుని వీడియో బైట్ ఇవ్వండి, ఇలాంటి వీడియో బైట్స్ పబ్లిక్ చాలామంది చూస్తారు... నాకు ఇండస్ట్రీలో చాలామంచి పేరు ఉంది. ఇంతవరకు నాకు రిమార్క్ లేదు. నా వీడియో బైట్స్ వలన ఎవ్వరు ఫిలవ్వలేదు.. అంటూ శ్రీకాంత్ వ్యాఖ్యలకు నరేష్ కౌంటర్ ఇచ్చారు.