బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది. ఒక వారం గడిచి రెండో వారంలోకి అడుగుపెట్టారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. మొదటి వారం ఎలిమినేషన్స్ లో యూట్యూబ్ సరయు హౌస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది. ఇక రెండో వారం నామినేషన్స్ విషయంలో బిగ్ బాస్ హౌస్ చాలా హాట్ హాట్ గా మారింది. సోమవారం రాత్రి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని రెండు గ్రూప్ లుగా విడదీసి వారి మధ్యలో నామినేషన్స్ ప్రక్రియ చేపట్టింది బిగ్ బాస్. అందులో మొహానికి ఎరుపు రంగు పూసి ఇద్దరినీ నామినేట్ చెయ్యాల్సి ఉంది. అందులో ప్రియా, నటరాజ్ మాస్టర్, యాని మాస్టర్, కాజల్, లోబో, ఉమాదేవి, ప్రియాంకలు ఈ వారం నామినేషన్స్ లోకి వెళ్లారు.
ఇక యూట్యూబ్ ఫేమ్ శ్వేతా హమీద, లోబో లని మీరు మానవత్వం మరిచిపోయారు అంటూ వారికి చాలా హార్ష్ గా రంగులు పూసింది. ఇక లోబో యాంకర్ రవి తో ఫ్రెండ్ షిప్ కి కటీఫ్ చెప్పేసాడు. అలాగే రవి నాకు నువ్వు కాంపిటీటర్ వి అందుకే నిన్ను నామినేట్ చేసునా అంటూ శ్రీరామ చంద్రని నామినేట్ చేసాడు. ఇక నటరాజ్ vs ప్రియా, ఉమాదేవి vs యాని మాస్టర్ అన్న రేంజ్ లో జోస్ లో ఈ వారం నామినేషన్స్ మంట పెట్టింది బిగ్ బాస్.