గత కొంతకాలంగా అంటే.. నాని మిడిల్ క్లాస్ ఎంసీఏ అప్పటి నుండి నాని నుండి వస్తున్న సినిమాలకు రావడం హిట్ టాక్ అయితే వస్తుంది. కానీ.. చివరికి ఆ సినిమాలు ప్లాప్ ల లిస్ట్ లో చేరిపోతున్నాయి. నాని డ్యూయెల్ రోల్ చేసిన కృష్ణార్జున యుద్ధం హిట్ హిట్ అన్నారు.. కానీ ఆ సినిమా మేకర్స్ కి లాస్ చూపించింది. చివరికి నానినే ప్లాప్ అని ఒప్పుకున్నాడు. తర్వాత గ్యాంగ్ లీడర్ కూడా అదే పరిస్థితి. ఇక గత ఏడాది వి. నాని - సుధీర్ బాబు కలయికలో వచ్చిన వి సినిమా అమెజాన్ ప్రైమ్ నుండి డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది. అది హిట్ అన్నారు. కానీ చివరికి సినిమా ప్లాప్ లిస్ట్ లో చేరినట్టే కనిపిస్తుంది.
తాజాగా నాని టక్ జగదీష్ టాక్ అంతే. క్రిటిక్స్, సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్, మౌత్ టాక్ అంతా టాక్ జగదీశ్ హిట్ అనే వచ్చింది. ఫ్యామిలీ డ్రామాగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా మేకర్స్ ఓటిటి లో రిలీజ్ చేసి మంచి పని చేసారు. లేదంటే.. కరోనా కాలంలో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి భయపడుతున్నారు. బ్లాక్ బస్టర్ టాక్ అయితే తప్ప.. సో సో టాక్ వచ్చే సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు.. అలా టక్ జగదీష్ పరిస్థితి అయ్యేది అని అంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో టక్ జగదీశ్ రెండు మూడు రోజులు ట్రెండ్ అయినా.. చివరికి ఈ సినిమా కూడా ప్లాప్ ల లిస్ట్ లోకెళ్ళిపోయిందటున్నారు.
ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో నాని.. ఇప్పడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అనేది నాని రీసెంట్ మూవీస్ లిస్ట్ టాక్స్ చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది.