Advertisementt

ప్రభాస్ యుకె ట్రిప్.. దానికోసమా..

Mon 13th Sep 2021 03:56 PM
prabhas,uk preparations,adipurush movie,prabhas adipurush,prabhas flying to uk  ప్రభాస్ యుకె ట్రిప్.. దానికోసమా..
Prabhas UK preparations for Adipurush ప్రభాస్ యుకె ట్రిప్.. దానికోసమా..
Advertisement
Ads by CJ

ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుని సలార్, ఆదిపురుష్ షూటింగ్స్ కి హాజరవుతున్నారు. ఆదిపురుష్ కోసం ముంబై, సలార్ కోసం హైదరాబాద్ కి  తిరుగుతున్న ప్రభాస్.. తాజాగా వెయ్యబోయే బ్రిటన్ ట్రిప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ సలార్, ఆదిపురుష్ షూటింగ్స్ కి కాస్త విరామం ఇచ్చి యుకె వెళ్లబోతున్నాడు. ప్రభాస్ యుకె ట్రిప్ కి కారణమేమిటంటే.. ప్రభాస్ లుక్ చేంజ్ కోసమేనట. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ లుక్స్ పై బోలెడన్ని నెగెటివ్ కామెంట్స్ పడుతున్నాయి. అయితే ఆదిపురుష్ లో రాముడి లుక్ కోసం ప్రభాస్ కి ఎలా ఉండాలో.. ముందే ఫోటో షూట్ ట్రైల్స్ వేసారట ఓం రౌత్. లుక్ మొత్తం ఓకె అయ్యింది. కానీ సెకండ్ వెవ్ లో ప్రభాస్ తన లుక్ విషయం లైట్ తీసుకున్నారట. 

మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ లుక్ విషయంలో ఇబ్బంది పడుతుండడడంతోనే.. ఓం రౌత్ ప్రభాస్ లుక్ కోసమే ప్రత్యేకంగా యుకె తీసుకువెళ్లాలని ప్లాన్ చేశారట. ప్రభాస్ లుక్, ఫిట్ నెస్ పై ప్రభాస్ ఫాన్స్ లోనే ఆందోళన ఉంది. దానితో ఓం రౌత్ కూడా ఆ ఎఫెక్ట్ ఆదిపురుష్ మీద పడకుండా ప్రభాస్ లుక్ విషయంలో సీరియస్ గా ఉన్నారట. సో అందుకోసమే ప్రభాస్ బ్రిటన్ కి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అక్కడి నుండి రాగానే ఆదిపురుష్ షూటింగ్ లో ప్రభాస్ నిర్విరామంగా పాల్గొంటారట. 

Prabhas UK preparations for Adipurush:

 Prabhas flying to UK

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ