Advertisementt

లవ్ స్టోరీ ట్రైలర్: ఎమోషన్స్ మేళ

Mon 13th Sep 2021 12:16 PM
naga chaitanya,sai pallvi,sekhar kammula,love story movie,naga chaitanya - sai pallvi love story,naga love story trailer  లవ్ స్టోరీ ట్రైలర్: ఎమోషన్స్ మేళ
Love Story Trailer Review లవ్ స్టోరీ ట్రైలర్: ఎమోషన్స్ మేళ
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టార్ మూవీ ఎప్పుడో ఏప్రిల్ లో విడుదల కావాల్సింది. ఏప్రిల్ లోనే చాలావరకు ప్రమోషన్స్ ని పూర్తి చేసింది లవ్ స్టోరీ టీం. కానీ అప్పుడు వాయిదా పడిన లవ్ స్టోరీ మళ్ళి ఈ నెల 24 న రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా లవ్ స్టోరీ మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. లవ్ స్టోరీ ట్రైలర్ మొత్తం ఎమోషన్స్ తోనూ, క్యూట్ లవ్ స్టోరీ గా కనిపిస్తుంది. ఓ వైపు బిజినెస్ చెయ్యాలనే కల, మరోవైపు డాన్సర్ గా రాణించాలనే లక్ష్యంతో రేవంత్ నాగ చైతన్య తిరుగుతుంటాడు. బ్యాంకు లోన్ 50 వేల కన్నా ఎక్కువ రాదని, తనకున్న అరెకరం పొలం అమ్మాలని అనుకుంటాడు. మరోవైపు జాబ్ చెయ్యాలనే లక్ష్యంతో సాఫ్ట్ వెర్ కంపెనీల చుట్టూ తిరుగుతుంది మోనికా పాత్రధారి సాయి పల్లవి. 

వీరి మధ్యన డాన్స్ కామన్ పాయింట్. అదే డాన్స్ వీరిని ప్రేమలో పడేసేలా చేసింది అని ట్రైలర్ లో చూపించారు. ఇక కులాలు, కొట్లాటలు, కట్టుబాట్లు, ఆస్తులు ఇవన్నీ వీరి ప్రేమకి అడ్డంగా నిలిచాయనే కోణంలో లవ్ స్టోరీని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మిడిల్ క్లాస్ ఫామిలీస్, మిడిల్ క్లాస్ లవ్ స్టోరీ, నాగ చైతన్య లుక్స్, సాయి పల్లవి లుక్స్, అలాగే సాయి పల్లవి డాన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని తెలుస్తుంది. ఇక నాగ చైతన్య మనకు లోన్లు ఇవ్వరు.. రెంటుకు రూములు ఇవ్వరు.. పిల్లనిస్తార్రా అని చెప్పిన డైలాగ్, బీటెక్ బీటెక్కే.. డ్యాన్స్ డ్యాన్సే.. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవా ని తన జాబ్ అడిగితే దొబ్బేయ్ అనే డైలాగ్స్ ఈ ట్రైలర్ లో అద్భుతంగా ఆకట్టుకున్నాయి. 

Love Story Trailer Review:

Naga Chaitanya - Sai pallvi Love Story Trailer revealed 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ