మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ లోని 12మంది సెలబ్రిటీస్ గత కొన్ని రోజులుగా ఈడీ అధికారుల ముందు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈడీ విచారణలో గంటల గంటలు విచారణ ఎదుర్కొన్న పూరి జగన్నాధ్, ఛార్మి, రకుల్ ప్రీత్, నందు, రానా లు మళ్ళీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతామని చెప్పినట్లుగా, ఇక డ్రగ్ సరఫరాదారుడు కెల్విన్ తో తమకి సంబంధాలు లేవని ఈడీ ముందు వారు చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోపక్క నవదీప్ ఫ్రెండ్, ఈ కేసులో ప్రధాన సూత్రధారి కెల్విన్ ని కూడా పదే పదే విచారణకు తీసుకుని వెళుతున్నారు ఈడీ అధికారులు.
మనీ లాండరింగ్ విచారణలో భాగంగా నేడు నవదీప్ ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యాడు. మనీ లాండరింగ్ కుంభ కోణంలో నవదీప్ బ్యాంకు ఖాతాలనున పరిశీలించడం, కెల్విన్ తో నవదీప్ కి ఉన్న స్నేహం పై ఆరా తియ్యనున్నారు. నవదీప్ విచారణ మొత్తం ఎఫ్‌క్లబ్ హిట్టునే తిరుగుతుంది అని తెలుస్తుంది. ఎఫ్ క్లబ్బులో జరిగే పార్టీలకు తరచూ ఎవరెవరు సెలబ్రిటీస్ హాజరవుతారు. అక్కడ జరిగే పార్టీల్లో డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తారనే దాని మీదే నవదీప్ కి ఈడి అధికారుల నుండి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఎఫ్‌క్లబ్ మేనేజర్‌ని కూడా నేడు నవదీప్ విచారణతో కలిసి ఈడీ అధికారులు విచారించనున్నారు.