అటు సంపత్ నంది దర్శకుడిగా వరస ప్లాప్స్ తో ఉన్నారు. ఇటు గోపీచంద్ కూడా వరసగా ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకసారి వీరి కాంబోలో గౌతమ్ నంద లాంటి ప్లాప్ మూవీ వచ్చింది. అయినా ఒకరిని నమ్మి ఒకరు సీటిమార్ అంటూ ఓ మాస్ మూవీ చేసారు. సంపత్ నంది దర్శకత్వం, గోపీచంద్ హీరోయిజం, కథా లో మాస్ అభిమానులు మెచ్చే ఎలిమెంట్స్ ఉండడంతో సీటిమార్ ని మాస్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఓ పక్క మౌత్ టాక్, మరోపక్క సోషల్ మీడియా టాక్, క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూస్ తో సీటిమార్ థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అదరగొట్టేస్తున్నాయి.
అటు సంపత్ నంది, ఇటు గోపీచంద్ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చేసారు. హీరోగా గోపీచంద్ మార్కెట్ పెరిగింది. మరోపక్క సంపత్ నందికి స్టార్ హీరోలకు కథలు చెప్పే అవకాశం వచ్చింది. ఒక్క సీటిమార్ సినిమా గోపీచంద్, సంపత్ ల కెరీర్ ని ఒక్కసారిగా పైకి లేపింది. మాస్ మసాలా హంగులతో మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన ఈ సినిమాకి ప్రభాస్ రివ్యూ బూస్ట్ ఇచ్చింది. తన ఫ్రెండ్ గోపీచంద్ మూవీ విజిల్ కొట్టించింది అంటూ ట్వీట్ చేసారు. దానితో ప్రేక్షకుల ఇంట్రెస్ట్ సీటిమార్ పై మరింతగా పెరిగింది. ఆదివారం వరకు సీటిమార్ థియేటర్స్ హౌస్ ఫుల్.. మండే పెర్ఫరామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.