Advertisementt

ప్రకాష్ రాజ్ పార్టీ.. బండ్ల కి కాలింది

Sun 12th Sep 2021 05:13 PM
maa elections,prakash raj party,bandla ganesh counter  ప్రకాష్ రాజ్ పార్టీ.. బండ్ల కి కాలింది
Prakash Raj Party, Bandla Ganesh counter ప్రకాష్ రాజ్ పార్టీ.. బండ్ల కి కాలింది
Advertisement
Ads by CJ

మాఎలక్షన్స్ కి టైం దగ్గర పడుతుంది. ఈలోపు మా ఎన్నికల్లో మా అధ్యక్ష పీఠం కోసం పోటీ పడే ప్రకాష్ రాజ్ ప్యానల్, విష్ణు మంచి ప్యానల్స్ హోరా హోరి యుద్దానికి సిద్ధమయ్యాయి. మధ్యలో విందులు, పార్టీలు అంటూ మా రాజకీయాలు పార్టీలు చుట్టూ తిరుగుతున్నాయి. గతంలోనే ప్రకాష్ రాజ్ ప్యానల్ మా సభ్యులకి పార్టీలో స్పెషల్ పార్టీ ఇచ్చినట్లుగా న్యూస్ రాగా.. మొన్న శనివారం ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్ వీకెండ్ పార్టీ ఇచ్చారని అన్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ మా సభ్యులని విందుకి ఆహ్వానించి.. పార్టీ ఇవ్వడంపై బండ్ల గణేష్ కౌంటర్ వేసాడు. 

అందరం మాట్లాడుకుందాం. మా లక్ష్యాలపై చర్చిద్దాం. అందరం కలిసి విందు చేద్దాం అంటూ ప్రకాష్ రాజ్ ఓ ప్రముఖ హోటల్ లో ఇచ్చిన పార్టీపై బండ్ల గణేష్ ఫైర్ అయ్యాడు. మా ఎన్నికల ఓట్ల కోసం కరోనా టైం లో క్యాపైనింగ్ లు నిర్వహించడం కరెక్టేనా అంటూ ట్వీట్ చెయ్యడంతో.. ప్రకాష్ రాజ్ కూడా బండ్ల ట్వీట్ కి కౌంటర్ వేశారు. మా లో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి.. అందరిని కూర్చోబెట్టి అడగడం తప్పు కాదు.. అయినా బండ్ల గణేష్ గుజరాత్ ఇంకా కొన్ని రాష్ట్రాలలో జరిగే ఎన్నికల ర్యాలీల గురించి ఆలోచిస్తే బావుంటుంది అంటూ స్పందించారు. ఇక జీవిత రాజశేఖర్ కూడా బండ్ల ట్వీట్ కి కౌంటర్ ఇవ్వడం కూడా టైం వేస్ట్ అంటూ కాస్త ఘాటుగా మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

Prakash Raj Party, Bandla Ganesh counter:

Maa Elections Prakash Raj Party, Bandla Ganesh counter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ