తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన మిస్టరీ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ - దిఫస్ట్ కేస్ సినిమా బాలీవుడ్ రీమేక్ ఆదివారం లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తెలుగులో హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నారు.
రాజ్‌కుమార్ రావ్, సాన్యా మల్హోత్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హీరో రాజ్ కుమార్ రావ్, నిర్మాతలు దిల్‌రాజు, భూషణ్ కుమార్, కుల్దీప్ రాథోర్‌తో పాటు దర్శకుడు డా.శైలేష్ కొలను పాల్గొన్నారు.
నగరంలో కనిపించకుండా పోయిన అమ్మాయిలను వెతికే పోలీస్ టీమ్ హోమిసైడ్ ఇంటర్వెన్‌షన్ టీమ్‌లో ఆఫీసర్ కేసును ఎలా సాల్వ్ చేశాడనేదే ఈ సినిమా కథాంశం. మిస్టరీ, సస్పెన్స్ అంశాల ఆకట్టుకునే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఇది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.