అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో గత ఏడాది నవంబర్ లో మొదలైన పుష్ప పాన్ ఇండియా ఫిలిం క్రిష్ట్మస్ కి రిలీజ్ కి సిద్దమవుతుంది. కరోనా, సెకండ్ వేవ్, సుకుమార్ కి డెంగ్యూ ఫీవర్ రావడం.. అలా అలా లేట్ అయిన పుష్ప షూటింగ్ ప్రస్తుతం కాకినాడ ఫోర్ట్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ముగించుకుని టీం మొత్తం కాకినాడ పయనమైంది. అల్లు అర్జున్, విలన్ ఫహద్ ఫాజిల్, సినిమాలోని కీలక పాత్రలపైన సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు సుకుమార్. అయితే కాకినాడ ఫోర్ట్ సమీపంలో పుష్ప షూటింగ్ కు అంతా సిద్ధమైన సమయంలో.. ఆ ఏరియాలో భారీగా వర్షం పడడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.
షూటింగ్ కి బ్రేక్ రావడం తో అల్లు అర్జున్ అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయంలో వినాయక చవితి రోజున థియేటర్స్ లో విడుదలై పోజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న గోపీచంద్ - సంపత్ నందిల సీటిమార్ మూవీ ని కాకినాడలోని ఓ థియేటర్స్ లో పుష్ప టీం తో కలిసి వీక్షించాడు. ఇక అల్లు అర్జున్ ఆ థియేటర్ కి రాగానే అల్లు ఫాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అల్లు అర్జున్ తో ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి ఎగబడిపోయారు. ఇక పుష్ప షూటింగ్ మరికొంత భాగం ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానుంది.