గొడవ పడితేనే కదా బిగ్ బాస్ హౌస్ లో ఉండేది.. ఇది బిగ్ బాస్ 5 హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ మైండ్ సెట్, బిగ్ బాస్ సీజన్స్ మొత్తాన్ని చూసి.. చక్కగా గేమ్ ఎలా ఆడాలో అనేది బాగా ఒంటబట్టించుకుని మరీ హౌస్ లోకి అడుపెట్టారు. స్టార్ మా కి కూడా ఎంత పారితోషకం ఇచ్చినా ఆయామన్న కంటెస్టెంట్స్ దొరక్క దొరికిన వాళ్లతో బిగ్ బాస్ సీజన్ 5 మొదలు పెట్టేసింది. గత రాత్రి నాగార్జున శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తప్పు చేసినా.. పాపం ఫస్ట్ వీక్ కదా వదిలేద్దామని, కట్ చేసుకో.. సెట్ చేసుకో టాస్క్ పెట్టి.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఏడిపించాడు. కెప్టెన్ సిరి అయితే వెక్కి వెక్కి ఏడ్చింది.
ఇక నాగార్జున సరయుని నీ బూతులు బిగ్ బాస్ లో వినిపించలేదు.. నువ్వు నీలా ఉండు అంటూ బూతులు మాట్లాడమని ఎంకరేజ్ చేసినట్టుగా కనిపిస్తే.. కార్తీక దీపం అర్ధపావు భాగ్యం ని నాగార్జున ఏమిటండి అస్తమాను గొడవలు పడుతున్నారంటే.. అలా గొడవ పడితేనే కదా బిగ్ బాస్ హౌస్ లో ఉండేది అంటూ చెప్పేసింది. దానిని నాగ్ అగ్రీ చెయ్యడం చూస్తే పక్కా ప్లాన్ చేసి మరీ హౌస్ లోకి వచ్చారనిపిస్తుంది. కాజల్, లహరి, హమీద, యాని మాస్టర్ ఇలా అందరూ గొడవలు పడుతూ గేమ్ ఆడేస్తున్నారు.