గత రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మెల్లగా కోలుకుంటున్నారు. అపోలో హాస్పిటల్ లో సాయి ధరమ్ తేజ్ కి డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ కంటి మీద, ఛాతి మీద, పొట్టపై బలమైన గాయాలు అయ్యాయి అని, ఈ రోజు వరకు సాయి తేజ్ కి వెంటిలేటర్ మీదే చికిత్స అందిస్తున్నట్టుగా, ప్రమాదం లేకపోయినా.. సాయి తేజ్ 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని అపోలో డాక్టర్స్ చెప్పారు. ఇక సాయి తేజ్ బైక్ మీద నుండి కింద పడగానే షాక్ తో ఫిట్స్ వచ్చాయని, ఆయన్ని మెడికవర్ హాస్పిటల్ కి తరలించేసరికి స్పృహ లేదని, అయితే మరోసారి ఫిట్స్ రాకుండా మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ఆయనకి చికిత్స అందించినట్లుగా చెప్పారు.
ఇక తాజాగా అపోలో వైద్యులు సాయి తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. అందులో సాయి ధరమ్ తేజ్ కి ఇంటర్నల్ గా ఎటువంటి గాయాలు లేవు అని చికిత్స కు సాయి ధరమ్ తేజ సహకరిస్తున్నారని, కాలర్ బోన్ శాస్త్ర చికిత్స కు 24 గంటలు తరువాత దాని గురుంచి చూస్తాం.. అని అపోలో వైద్యులు ప్రకటించారు. ఇక గత రాత్రి నుండి మెగా ఫ్యామిలీ ఆల్మోస్ట్ అంతా అపోలోనే ఉన్నారు. చిరు ఆయన వైఫ్ సురేఖ సాయి తేజ్ ని పరామర్శించి సాయి తేజ్ ఆరోగ్యంపై డాక్టర్స్ తో మట్లాడారు. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ సాయి తేజ్ ని పరామర్శించాడనికి అపోలో హాస్పిటల్ కి వచ్చారు.