Advertisementt

దసరా ని వదిలేస్తున్న బాలయ్య, చిరు?

Thu 09th Sep 2021 09:06 PM
akhanda,acharya movie,balakrishna,chiranjeevi,akhanda and acharya release dates  దసరా ని వదిలేస్తున్న బాలయ్య, చిరు?
New Release Dates For Akhanda And Acharya Movies దసరా ని వదిలేస్తున్న బాలయ్య, చిరు?
Advertisement
Ads by CJ

సెకండ్ వెవ్ కరోనా అభిమానుల ఆశల మీద నిర్ధాక్షిణ్యంగా నీళ్లు చల్లేసింది. ఎప్పుడో మే లో విడుదల కావాల్సిన ఆచార్య, అఖండ, ఖిలాడీ లాంటి సినిమాలు అన్ని వాయిదాలు పడ్డాయి. రాధేశ్యాం, పుష్ప, లైగర్, కెజిఎఫ్ 2 ఇలా పాన్ ఇండియా మూవీస్ కూడా వాయిదాలు పడిపోయి నెక్స్ట్ ఇయర్ కి డేట్ మార్చేసుకున్నాయి. కానీ బాలకృష్ణ అఖండ, చిరు ఆచార్య మూవీస్ రిలీజ్ డేట్స్ ఇవ్వకుండా అభిమానులని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మేకర్స్. అఖండ, ఆచార్య సినిమా షూటింగ్స్ ఫినిష్ అయ్యాయి. ఒకటో రెండో సాంగ్స్ తప్ప.. అఖండ కి బాలయ్య డబ్బింగ్ కూడా చెప్పేసారు. ఆచార్య రెండు పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 

కానీ రిలీజ్ డేట్స్ ఇవ్వడం లేదు. దసరా బరిలో బాలయ్య, చిరు తలపడతారనుకుంటే.. ఇప్పుడు దసరా బరి నుండి ఆచార్య, అఖండ లు ఆల్మోస్ట్ తప్పుకునెలా అనిపిస్తుంది. లేదంటే ఈపాటికి రిలీజ్ డేట్స్ ఇచ్చేసేవారే. బాలకృష్ణ, చిరు ఆ విషయంలో కామ్ గా ఉన్నారు. చిరు తదుపరి చిత్రం గాడ్ ఫాదర్ షూటింగ్ చేసుకుంటున్నారు. బాలయ్య దసరా నుండి గోపీచంద్ మలినేని తో చెయ్యబోయే NBK107 షూటింగ్ కి వెళ్ళిపోతారు. మరి దశరాని వదులుకుంటే అఖండ కి ఆచార్యకి మంచి డేట్స్ ఎప్పుడు దొరకాలి.. మరి మేకర్స్ ఈ విషయంలో కాస్త ఆలోచిస్తే బెటర్ ఏమో చూడండి. 

New Release Dates For Akhanda And Acharya Movies:

Akhanda And Acharya Movie Release Dates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ