Advertisementt

నాగబాబు ఎంత నిజాయితీనో.. మేము అంతే

Thu 09th Sep 2021 07:01 PM
maa,maa building controversy,shivaji raja,naresh,nagababu,mohan babu,shivaji raja clarifies  నాగబాబు ఎంత నిజాయితీనో.. మేము అంతే
Shivaji raja Explains MAA Building issue నాగబాబు ఎంత నిజాయితీనో.. మేము అంతే
Advertisement
Ads by CJ

మా ఎన్నికల వేడి టాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఓ పక్క టాలీవుడ్ సెలేబ్రిటిస్ పై ఈడీ విచారణ, మరోపక్క మా ఎన్నికల మాటల యుద్ధం. అబ్బో టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ ల కన్నా ఎక్కువగా ఈ మేటర్స్ నడుస్తున్నాయి. మా భవనం విషయంలో మంచు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కౌంటర్ గా నాగబాబు స్పందించారు. నేను నా హయాంలో మా భావాన్ని 90 లక్షలకు కొంటే.. శివాజి రాజా హయాంలో శివాజీ రాజా, నరేష్ కలిసి మా భావాన్ని 30 లక్షల తక్కువకి ఎందుకు అమ్మేసారో వారినే అడిగి తెలుసుకోండి.. నా వరకు వస్తే నేను స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వగలను అంటూ ఘాటుగా స్పందిస్తే.. తాజాగా నాగబాబు వ్యాఖ్యలపై శివ రాజా స్పందించారు. మా హయాంలోనే మా భవనాన్ని అమ్మేసాం అని, కానీ అది భవనము కాదని, కేవలం డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ అని, అది కూడా పెంట్ హౌస్ అని శివాజీ రాజా చెప్పారు. 

నాగబాబు హయాంలో ఎంత నిజాయితీగా మా భవనం కోసం ఆ ఫ్లాట్ ని కొన్నారో.. నేను నరేష్ అంతే నిజాయితీగా ఆ ఫ్లాట్ ని అమ్మేసాం. అమ్మకానికి మా ఫ్లాట్ అని ప్రకటన ఇచ్చినా ఎవరు ముందుకు రాలేదు అని, ఆఖరికి మా కి సేవలు అందించిన శ్రీధర్ కి ఆ ఫ్లాట్ ని అమ్మేశామని, నరేష్ కార్యదర్శిగా, నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా ఫ్లాట్ అమ్మేసినట్లుగా శివాజీ రాజా చెప్పుకొచ్చారు. ఆ ఫ్లాట్ కి సింగిల్ గోడ, కింద మురికి కాలువ వంటి అనేక సమస్యలు ఉన్నాయని, అందుకే ఆ ఫ్లాట్ ని అమ్మాలని పలువురు పెద్దలు కూడా సూచించారని.. కాబట్టే అమ్మేశామని, ఇంకా అనుమానాలు ఉంటే తనని అడగవచ్చని శివాజీ అన్నారు. 

Shivaji raja Explains MAA Building issue:

MAA Building controversy: Shivaji Raja clarifies, reveals

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ