Advertisementt

సెకండ్ వీక్ లోను తగ్గని ఎన్టీఆర్ షో

Thu 09th Sep 2021 06:20 PM
ntr,evaru meelo koteeswarudu,stands first,bigg boss telugu,jabardasth  సెకండ్ వీక్ లోను తగ్గని ఎన్టీఆర్ షో
NTR Evaru Meelo Koteeswarudu stands First సెకండ్ వీక్ లోను తగ్గని ఎన్టీఆర్ షో
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర మీద బిగ్ బాస్ షో కి వ్యాఖ్యాతగా అదరగొట్టేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ వన్ కి ఎన్టీఆర్ హోస్టింగ్ లో స్టార్ మా కి అదిరిపోయే టిఆర్పి ని తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సీజన్స్ కి ఎన్టీఆర్ కాకుండా నాని, వరసగా నాగార్జున వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఈమధ్యన జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హోస్ట్ గా మారారు. ఓపెనింగ్ ఎపిసోడ్ తోనే అంచనాలు పెంచేసిన ఎన్టీఆర్.. సోమవారం నుండి గురువారం వరకు రాత్రి 8.30 నిమిషాలకు ఎవరు మీలో కోటీస్వరులు అంటూ సూటు బూటు వేసుకుని దిగిపోతున్నాడు. కంటెస్టెంట్స్ కి ప్రశ్నలు సంధిస్తూ మద్యమద్యలో పర్సనల్ విషయాలతో ఎన్టీఆర్ షో పై అందరిలో క్రేజ్ పెంచేసాడు. 

గతంలో మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ చిరంజీవి, నాగార్జున లు ఈ షో కి హోస్ట్ గా చేసినప్పుడు జెమినీ టివికి అంతగా టిఆర్పి వచ్చింది లేదు. అప్పటినుండి ఈ షో చెయ్యడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఎన్టీఆర్ ఈ షో బాధ్యతలు తన భుజాన మోస్తూ అందరిలో షో మీద ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన ఎవరు మీలో కోటీశ్వరులు షో మొదటి వారం టిఆర్పి రేటింగ్  లో అదరగొట్టేసింది. రెండో వారంలోను ఎన్టీఆర్ షో అదే జోరు చూపించింది. ఈ ప్రోగ్రామ్ ప్రీమియర్ ఎసిపోడ్..11.40 రేటింగ్ సాధించగా.. రెండో వారంలో ఏమాత్రం తగ్గలేదు. 

NTR Evaru Meelo Koteeswarudu stands First:

NTR Evaru Meelo Koteeswarudu stands FIRST, beats Bigg Boss Telugu 5 & Jabardasth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ