డ్రగ్స్ కేసు నుండి మనీ లాండరింగ్ కేసు గా టర్న్ అవడంతో ఈడీ అధికారులు టాలీవుడ్ లో 12 మంది సెలబ్రిటీస్ కి నోటీసు లు ఇచ్చి.. విచారణకు పిలవగా.. పూరి, ఛార్మి, రకుల్, రానా, నందులు ఇప్పటికే ఈడీ విచారణలో పాల్గొన్నారు. ఈ కేసులో కీలకమైన డ్రగ్ సరఫరా దారుడు కెల్విన్ ని కొన్ని రోజులుగా ఈ సెలబ్రిటీస్ తో కలిసి విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఇక నేడు ఈడీ ఎదుట హీరో రవి తేజా ఆయన కార్ డ్రైవర్ శ్రీనివాస్ తో పాటుగా హాజరయ్యారు. ఈ రోజు ఉదయమే ఈడీ విచారణ కోసం ఈడీ ఆఫీస్ కి వచ్చాడు రవితేజ.
రవితేజ ని ఆయన కారు డ్రైవర్ ని దాదాపుగా 6 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ కేసులో రవి తేజ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు.. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీసినట్టు సమాచారం. అంతేకాకుండా కెల్విన్ తో రవితేజకు పరిచయం ఉందా? అనే కోణం నుండి కూడాఈడీ అధికారులు రవితేజ ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీ గురించికూడా ఈడీ అధికారులు రవి తేజ మీద ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా సమాచారం.