గత వారం రోజులుగా టాలీవుడ్ లో 12 మంది సెలబ్రిటీస్ ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. డ్రగ్స్ కేసు పక్కనపెట్టి.. మనీ లాండరింగ్ కేసులో 12 మంది సెలబ్రిటీస్ కి ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే పూరి ని 10 గంటలు, ఛార్మిని 8 గంటలు, రకుల్ ని 6 గంటలు, నందు ని 8 గంటలు, రానాని 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు నేడు హీరో రవితేజ ని విచారణకు పిలిచారు. అయితే పూరి, ఛార్మి, రకుల్ విచారణ తర్వాత నందు, రానా ల విచారణ టైం లో ఈ కేసులో కీలక సూత్రదారు కెల్విన్ ని కూడా ప్రశ్నించారు. నవదీప్ - రానా లు, కెల్విన్ ఫ్రెండ్స్ అవడం, కొంతమంది సెలబ్రిటీస్ కి కెల్విన్ ఉన్న సంబంధాల ఆధారంగా ఈడీ అధికారులు ఈ విచారణ చేపట్టారు.
ఇక నేడు రవి తేజ ఈడీ విచారణ కోసం ఈడీ ఆఫీస్ కి వచ్చారు. రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ తో పాటుగా రవితేజ ఈడీ ఆఫీస్ కి వచ్చారు. డ్రగ్స్ కేసులోనూ రవితేజ ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ని పోలీస్ అధికారులు ప్రశ్నించారు. మళ్ళీ ఈ కేసులో రవితేజ తన డ్రైవర్ తో పాటుగా ఈడీ విచారణ చేపట్టారు. మరి ఈ రోజు కూడా కెల్విన్ కూడా రవి తేజ తో పాటు విచారణకు హాజరవడంతో కెల్విన్ -రవితేజాలను కలిపి ఈడీ అధికారులు విచారించబోతున్నారు. బ్యాంకు లావాదేవీలు, కెల్విన్ తో పరిచయమై ఈడీ అధికారులు రవితేజ ని ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తుంది.