సినిమా టికెట్ల విషయంలో ఏపీ గవర్నమెంట్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మధ్యకాలంలో ఏపీలో థియేటర్స్, సినిమాల టికెట్స్ రేట్స్ విషయంలో జగన్ ప్రభుత్వం టాలీవుడ్ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే ఉంది. వకీల్ సాబ్ టైం లో టికెట్ రేట్స్ తగ్గించిన జగన్ ప్రభుత్వం తాజాగా.. సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి జీవోని కూడా విడుదల చేసింది. రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో సినిమా టికెట్ల కోసం ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంటూ, దీనికి సంబంధించిన వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని తాజాగా విడుదల చేసిన జీవోలో ప్రకటించింది.
ప్రస్తుతం తమిళనాడులో ఈ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని థియేటర్లన్నింటిని ఆన్‌లైన్ చేసే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం ఎప్పుడో మొదలుపెట్టింది. మొత్తం బి,సి సెంటర్స్‌లోని థియేటర్లని కూడా అక్కడ ఆన్‌లైన్ చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు సినిమా థియేటర్స్‌లో టికెట్స్ విక్రయించే ప్రక్రియను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం.. స్వయంగా ప్రభుత్వమే ఓ పోర్టల్‌ను అభివృద్ది చేస్తుందని ప్రకటించడం విశేషం. కలెక్షన్ అంతా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది.. ప్రతి నెలా 30 వ తారీఖున ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళ వాటా ఇస్తారు, అప్పటిదాకా డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గరే వుంటాయి.