పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది అభిమానుల ఇచ్చిన బిరుదు. పవర్ స్టార్ ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. పవర్ స్టార్ పేరు సిల్వర్ స్క్రీన్ మీద కనబడగానే.. పవన్ ఫాన్స్ పూనకాలతో ఊగిపోతారు. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ గోల గోల చేస్తారు. రాజకీయాలు, సినిమాలు అంటూ బిజీ బిజీగా వున్నాపవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ భీమ్లా నాయక్ షూట్ తో పాటుగా, క్రిష్ - ఏ ఎమ్ రత్నం హరి హర వీరమల్లు షూటింగ్ చర్చలలోను, హరీష్ శంకర్ తో చెయ్యబోయే PSPK 28 కథా చర్చల్లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. మరోపక్క పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బిజెపి నేతలతో భేటీ అవుతున్నారు.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన పేరుకి ముందు ఉండే బిరుదు విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారట. అంటే పవర్ స్టార్ అనే బిరుదు తనకి వద్దని పవన్ ఫిక్స్ అయ్యారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరులో పవర్ స్టార్ అనే పేరుని తీసేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నటిస్తున్న సినిమాల టైటిల్స్ లో ఆల్మోస్ట్ పవర్ స్టార్ పేరు కనిపించనట్లే అని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తాను చేస్తున్న దర్శక సినిమాల నిర్మాతలతో మాట్లాడారట కూడా. తన పేరుకి ముందు పవర్ స్టార్ అనే పేరు ని వాడొద్దు అని గట్టిగానే చెప్పారట. అంటే ఇక మీద పవన్ కళ్యాణ్ ముందు పవర్ స్టార్ లేనట్లేనట.
మరి పవన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కానీ.. పవన్ ఫాన్స్ మాత్రం పవర్ స్టార్ పేరు లేకపోతె పవన్ పేరుకి అర్ధమే లేనట్లుగా తెగ బాధపడిపోతున్నారట.