Advertisementt

RC15 ఓపెనింగ్ గెస్ట్స్ ఎవరంటే..

Wed 08th Sep 2021 11:27 AM
rc15,ram charan,dil raju,megastar chiru,shankar,kiara advani,thaman,bollywood hero,ranveer singh,megastar chiranjeevi,ranveer,rajamouli,rc 15 opening  RC15 ఓపెనింగ్ గెస్ట్స్ ఎవరంటే..
Megastar Chiranjeevi, Ranveer, Rajamouli attend RC 15 opening RC15 ఓపెనింగ్ గెస్ట్స్ ఎవరంటే..
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - శంకర్ కాంబోలో RC 15 అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో ఈ రోజు బుధవారం ఉదయం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు కాంబోలో మొదలైన RC15 లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ రెడీ చేసిపెట్టేసాడు. అయితే నేడు RC15 మూవీ ఓపెనింగ్ సెర్మనీ కి బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోస్ హాజరవుతారని ప్రచారం జోరుగా సాగింది. 

మరి నిజంగానే RC15 కి స్పెషల్ గెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హాజరయ్యారు. రణ్వీర్ RC15 ఓపెనింగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగే మెగాస్టార్ చిరు చేతుల మీదుగా RC15 పూజ కార్యక్రమాలు సాగాయి. మెగాస్టార్ చిరు తో పాటుగా ఆర్.ఆర్.ఆర్ డైరెక్టర్ రాజమౌళి బాలీవుడ్‌ స్టార్‌హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఈ వేడుకలో పాల్గొని RC15 టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. RC15 ముహూర్తపు షాట్‌లో భాగంగా చిరంజీవి, రామ్‌చరణ్‌పై క్లాప్‌ కొట్టారు. ఇంకా శంకర్ హీరోయిన్ కియారా అద్వానీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, దిల్ రాజు, జానీ మాస్టర్ ఈ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం RC15 ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Megastar Chiranjeevi, Ranveer, Rajamouli attend RC 15 opening:

RC15 Shooting starts in Hyderabad 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ