రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ ముగించడమే కాదు ఆచార్య షూటింగ్ కూడా ముగించేసి.. తాను శంకర్ తో చెయ్యబోయే RC15 కి కోసం రెడీ అయ్యాడు. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న RC15 కి రంగం సిద్ధం అవడమే కాదు.. నేడు అఫీషియల్ గా RC15 మూవీ పూజ కార్యక్రమాలతో మొదలైపోయింది. ఇప్పటికే రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీలు RC15 ట్రయిల్ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో RC15 ఫోటో షూట్ చరణ్, కియారా లపై చిత్రీకరించారు.
ఇక తాజాగా RC15 ఈ రోజే ప్రారంభం అన్నట్టుగా ఓ పోస్టర్ ని రివీల్ చేసింది టీం. ఆ RC15 పోస్టర్ లో డైరెక్టర్ శంకర్, హీరో రామ్‌చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, ప్రొడ్యూసర్ దిల్‌రాజు కోటు, బూటు వేసుకుని ఫైల్స్ చేతబట్టుకుని హడావిడి చేస్తున్నట్టుగా గ్రాండ్ గా డిజైన్ చేసారు. ఈ రోజే RC 15 ముహూర్తం.. హైదరాబాద్ లో జరగబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు. ఇంకా ఈ సినిమాలో అంజలి, సునీల్, జయరామ్ కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ రోజు మొదలు కాబోతున్న RC 15 మూవీ రెగ్యులర్ షూట్ కూడా త్వరలోనే మొదలు కాబోతుంది. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుంటే.. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందిస్తున్నారు.