Advertisementt

ఢిల్లీ లో పవన్

Tue 07th Sep 2021 08:18 PM
janasena president,pawan kalyan,delhi tour  ఢిల్లీ లో పవన్
Pawan Kalyan Delhi tour ఢిల్లీ లో పవన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా తాను నటిస్తున్న సినిమాల షూటింగ్స్ తో కాకుండా... ఆ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలతో, డైరెక్టర్స్ తో సమావేశమైన న్యూస్ లు ఫొటోస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఏకే రీమేక్ భీమ్లా నాయక్ లో నటిస్తున్న పవన్ తదుపరి మూవీ హరి హర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ అండ్ నిర్మాత ఏ ఎమ్ రత్నం తో సమావేశమై హరి హర వీరమల్లు విషయాలను చర్చించారు. మరోపక్క పవన్ కళ్యాణ్ - హారిష్ శంకర్ కాంబోలో తెరకెక్కబోయే మూవీ కథ చర్చల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పవన్ భేటీ అయ్యారు. రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ రెండు సినిమాల నిర్మాతలతో హడావిడి చేస్తున్నారు. 

ఇక నేడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పయనమయ్యారు. రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తో సన్నిహితంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఉదయమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఢిల్లీ లో పవన్ ముందుగా ప్రహ్లాద్ జోషి తో సమావేశమయ్యారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా తిరుగుతున్నారు. 

Pawan Kalyan Delhi tour:

Janasena President Pawan Kalyan Delhi tour 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ