టాలీవుడ్ డ్రగ్స్ కేసు కాస్తా మనీ లాండరింగ్ కేసుగా మారిపోయి పలువురు సెలబ్రిటీస్ ని చిక్కుల్లో పడేసింది. ఈ కేసు మొత్తం ప్రధాన నిందుతుడు కెల్విన్ చుట్టూనే తిరుగుతుంది. కెల్విన్ తో మనీ లావాదేవీలు, కెల్విన్ తో వాట్స్ అప్ చాటింగ్స్ అన్ని 12 మంది సెలబ్రిటీస్ మెడకి చుట్టుకున్నాయి. కెల్విన్ ని అరెస్ట్ చెయ్యగా అతని ద్వారా 12 మంది సెలబ్రిటీస్ పేర్లు బయటికి వచ్చాయి. గతంలో ఈడీ విచారణలో పాల్గొన్న వారు కాకుండా రకుల్, రానా లు ఈ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఇప్పటికే పూరి, ఛార్మి, రకుల్ ని విచారించిన ఈడీ అధికారులు నేడు నందు ని విచారిస్తున్నారు.
అంతేకాకుండా నందు ని విచారిస్తున్న ఈడీ అధికారులు కెల్విన్ ఇంటికి సీఆర్పీఎఫ్ బలగాలతో వెళ్లి కెల్విన్ ని విచారణకు పిలిచి ఆయన ఇంట్లో మూడు గంటల పాటు సోదాలు నిర్వహించగా.. లాప్ టాప్, నగదు, కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ముందు కెల్విన్ విచారణ కోసం సంతకం చేసేందుకు నిరాకరించగా.. కెల్విన్ భార్య పోలీస్ లకి సహకరించమని చెప్పడంతో కెల్విన్ ఈడి అధికారులు వెంట విచారణకు వచ్చాడు. ఇక కెల్విన్ ని నందుని కలిపి విచారిస్తున్న ఈడి అధికారులు ఈ కేసులో మరో నిందితుడిని మెహదీపట్నంలో అరెస్ట్ చేసారు.